Pages

Saturday 21 September 2013

మోడి ముస్లింలకు వ్యతిరేకమా? అయితే ఈ క్రింద నిజాలు చదివి మీరే నిర్ణయించుకోండి !


1. 2012 ఎన్నికలు: 31% ముస్లింలు నరేంద్ర మోడి(భాజపా)కి ఓటు వేశారు. 2013 ఉప ఎన్నికలు: కాంగ్రెస్ చేతిలో ఉన్న 6 స్థానాలు భాజపా చేదక్కిచ్చుకుంది. ముస్లింల సహకారం లేకుండా మోడి గెలవగలిగేవారా? 

2. గుజరాత్ లో 8 ముస్లిం ఆధిక్య MLA సీట్లు ఉన్నాయి. వాటిలో భాజపా 6 గెలిచింది. ముస్లింల సహకారం లేకుండా గెలిచిఉండేదా? 

3. గత 6 దశాబ్దాల కాలంలో కేవలం నరేంద్ర మోడి 10 యేళ్ళ పాలనలో మతకలహాలు జరగలేదు. 

4. గుజరాత్ లో జరిగిన 6 మతకలహాలలో కాంగ్రెస్ 1969, 1987, 1989, 1990, 1992 సంవత్సరాలలో అధికారంలో ఉంది. వందల మంది ముస్లింలు చనిపోయారు. చార్జ్ షీట్ల గురించి మర్చిపోండి, కనీసం వాటిమీద FIR కూడా లేదు. అదే 2002 లో గుజరాత్ లో అల్లర్లు జరిగినపుడు భాజపా ప్రభుత్వం 200+ మంది హిందువులను అరెస్టు చేసింది మరియు 150 మంది జీవిత ఖైదు అనుభవిస్తున్నారు. తేడా గమనించారా? 

5. 2002 గుజరాత్ అల్లర్లు గురించి మట్లాడుతు నరేంద్ర మోడిని ముస్లిం వ్యతిరేకిగా చూపించేవారు, 1964 బిహార్, 1980 ఉత్తర్ ప్రదేశ్, 1969 అహ్మదబాద్(గుజరాత్), 1983(అస్సాం), 1989 భగల్ పూర్, 1993 మహారాష్ట్ర లలో జరిగిన అల్లర్లను ఎవరు ప్రశినించరు ఎందుకు? ఈ అల్లర్లలో చనిపోయిన ముస్లింలు 2002అల్లర్లలో చనిపోయిన ముస్లింలకంటే అధికంగా ఉన్నారు ! ఈ అల్లర్లు అన్నీ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే జరిగాయి !

6. ఇందిరా గాంధిని చంపినందుకు ప్రతిక్రియగా ఢిల్లిలో 1984 లో సిక్కుల మారణహోమం జరిగిన తరువాత రాజివ్ గాంధి ఒక మాట అన్నారు: " ఒక పెద్ద వృక్షం పడిపోతే భూమి కంపిస్తుంది" అని ! ఈ విషయంపై ఒక్క మానవ హక్కుల సంఘం వారు కూడా ఎందుకు మాట్లాడలేదు? 

7. సల్మాన్ ఖాన్ తండ్రి సలీం ఖాన్ ఈ విధంగా అడిగారు: "1993 ముంబాయిలో జరిగిన అల్లర్లు 2002 కంటే తక్కువ హింసాత్మకమైనవి కాదు. మరి అప్పుడు మహారాష్ట్రా ముఖ్యమంత్రి కాంగ్రెస్ అతను కాదా? 

8. గుజరాత్ మౌల్వి వాస్తన్వి: మోడి చేసిన అద్భుతమైన అభివృద్ధి ద్వారా ముస్లింలు ఎంతో లబ్ధిపొందారు. 

9. మౌలానా మహ్మద్ మదని(జమాతుల్ ఉలేమా ఏ హింద్)- మిగిల్న రాష్ట్రాలతో పోల్చి చూస్తే గుజరాత్లో ముస్లింలు ఎంతో ఆనందంగా ఉన్నారు.

10. మహారాష్ట్రా మాజీ IGP ముషారఫ్ "Milli gazatte paper" కు ఈ విధంగా చెప్పారు: "ఈరోజు ముస్లింలకు సురక్షితమైన ప్రాంతం ఏదంటే అది గుజరాత్"

11. కేరళా మైనారిటీ హై కమీషన్ సభ్యుడు వివి అగస్టీన్ ఈ విధంగా చెప్పారు: " పేద ముస్లింల ఆర్ధిక స్థితి గుజరాత్లో ఎంతో మెరుగుపడింది. దానిని నేను ఎలా కాదనగలను" 

12. సబర్మతి నది ప్రాజెక్టు జరుగుతున్నపుడు 13,000 కుటుంబాలను అక్కడినుంచి తొలగించవలసి వచ్చింది. వారిలో 68% ముస్లింలు. ఇప్పుడు వారందరికి అపార్టుమెంటు కల్పించారు. మోడి ఎటువంతి వివక్ష చూపలేదు. 

13. గుజరాత్ లో ముస్లిం జనాభ 10% కంటే తక్కువగా ఉంటుంది. గుజరాత్ లో 12% పోలీసులు ముస్లింలే మరియు 10% ప్రభుత్వ ఉద్యోగాలు ముస్లింలవే !

14. కాబట్టి గుజరాత్ ముస్లింలు ఎంతో సురక్షితంగా ఉన్నారు, ఆర్ధికంగా కూడా వారి స్థితి ఎంతో బావుంది. ఇంకా మోడిని ముస్లిం వ్యతిరేకి అంటారా?

మోడి ఎప్పుడు మైనారిటీ వోట్ల కొసం అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్పరు. ఆయనకి మెజారిటీ, మైనారిటీ అందరు సమానమే ! 10 యేళ్ళ నుంచి కుహానా లౌకికవాదులు, కుహానా రాజకీయనేతలు ఆయన్ని అనవసరంగా దూషిస్తూ ఆయన్ని రాక్షసుడిగా చూపించాలని ప్రయత్నిస్తున్నా వారు విఫలం అవ్తునారు. గుజరాత్ ముస్లింలు నరేంద్ర మోడి ని ఎంతో నమ్ముతారు. అందుకే వారు అభివృద్ధి చెందారు. మనం కులం/ మతం వాడుకోకుండా రాజకీయాలు చేయలేకపోతున్నాం. అందుకే ఇంకా వెనకబడి ఉన్నాం.

కులమతాలకు అతీతంగా అభివృద్ధి గురించి అలోచించే నరేంద్ర మోడి ప్రధాన మంత్రి అయితే కాని మన దేశ దశ దిశ మారదు. కావున అందరు వోటు వేయండి. నిజమైన లౌకికవాదులను గెలిపించంది. మనమందరం భారత మాత బిడ్డలం !

జై హింద్ ! వందే మాతరం ! 

14 పాయింట్లు తప్పక చదవండి. తప్పుడు ప్రచారాలు చేసేవారికి సరైన సమాధానం చెప్పండి !

No comments:

Post a Comment